OTTలోకి మెగాస్టార్ భోళా శంకర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTTలోకి మెగాస్టార్ భోళా శంకర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన తాజా చిత్ర భోళా శంకర్(Bholaa Shankar) ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా.. మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చూస్తున్నారు చాలా మంది. ఇందులో భాగంగానే తాజాగా భోళా శంకర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.   

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది భోళా శంకర్ సినిమా. తెలుగు తోపాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది ఈ సినిమా. మరి థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.