చిరంజీవి ఫోన్‭లో రే కాంటాక్ట్ నంబర్ ఎవరిది.!

చిరంజీవి ఫోన్‭లో రే కాంటాక్ట్ నంబర్ ఎవరిది.!

తన యాంకరింగ్‭తో అందరిని అలరిస్తున్న సుమ.. కొత్తగా "సుమ అడ్డా" షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోలో తొలి గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‭లో బిజీగా ఉన్న చిరంజీవి.. చిత్ర బృందంతో కలిసి సుమ అడ్డా షోకు వచ్చారు. ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదలైంది.  మధ్యలో సినిమాకు సంబంధించిన డైలాగులను డైరెక్టర్ బాబీతో చెప్పించారు. ఇక నటుడు వెన్నెల కిషోర్ డాక్టర్‭లా యాక్ చేస్తూ షోకు వచ్చిన ప్రేక్షకులను అలరించారు. 

ఇక చిరంజీవిని సుమ కొన్ని ప్రశ్నలు వేసింది. మీ మొబైల్‭లో సురేఖ పేరు ఏమని సేవ్ చేసుకున్నారని అందరి ముందు అడిగేసింది. రే అని ఉంటుంది అని చిరు ఓ నవ్వు నవ్వారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు కళ్యాణ్ బాబు అని ఉంటుందని చెప్పారు. రామ్ చరణ్ పేరు చెర్రీ అని ఉంటుందని మెగాస్టార్ జవాబిచ్చారు. తన నాన్న దూరమైన తర్వాత చాలా మిస్ అవుతున్నానని చెప్పారు. తన నాన్న కాని తిరిగి వస్తే చూసుకోవాలని ఉందంటూ మెగాస్టార్ భావోద్వేగానికి గురయ్యారు.