ముల్లోక వీరుడుగా మెగాస్టార్‌.. ఏకంగా ఆరుగురు హీరోయిన్స్

ముల్లోక వీరుడుగా మెగాస్టార్‌.. ఏకంగా ఆరుగురు హీరోయిన్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బింబిసారా(Bimbisara)తో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట(Vashishta) ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ఇక తాజాగా ఈ ప్రాజెక్టు నుండి  వినిపిస్తున్న మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక వీరుడి పాత్రలో కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకి "ముల్లోక వీరుడు(Mulloka Veerudu)" అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ తో ఆడిపాడనున్నాడట చిరు.     ఇక ఈ విషయం తెల్సుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకట రావాల్సి ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్(Bhola shankar) సినిమా చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా(Thamannaah) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్(Keerthi Suresh) చిరుకి చెల్లిగా నటిస్తోంది.