శ్రీకాంత్ కాదు కళ్యాణ్ ఫిక్స్.. త్వరలోనే సెట్స్ పైకి

శ్రీకాంత్ కాదు కళ్యాణ్ ఫిక్స్.. త్వరలోనే సెట్స్ పైకి

రీ ఎంట్రీ  తరువాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఖైదీ నెంబర్ 150(Khaidu no150)  నుండి మొదలుపెడుతే రీసెంట్ గా రిలీజైన వాల్తేరు వీరయ్య(Valteru Veerayya) వరకు క్షణం తీరిక లేకుండా గడిపారు. ఇక చిరు నెక్స్ట్ మూవీ భోళా శంకర్(Bhola shankar) కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

మెహర్ రమేష్(Meher Ramehs) తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

అయితే భోళా శంకర్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే..  చిరు నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. చిరు తన తరువాతి సినిమా కోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకున్నారట. అందులో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన కుర్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth odela), మరొకరు సోగ్గాడే చిన్నినాయనా ఫెమ్ కళ్యణ్ కృష్ణ కురసాల(Kalyan Krishna kurasala).

ఈ ఇద్దరిలో.. కళ్యణ్ కృష్ణ కురసాల సినిమా ఒక అయ్యేలా కనిపిస్తోంది. ఈ దర్శకుడు చెప్పిన కథకు చిరు చాలా ఇంప్రెస్ అయ్యారట. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా ఇప్పటికే రెడీ అయిందని సమాచారం. దీంతో మరికొన్ని రోజుల్లో చిరంజీవి,ఎం కళ్యాణ్ కృష్ణ కురసాలకు సంబందించిన మూవీ గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఏ రేంజ్ హిట్ కొడతాడా చూడాలి మరి.