'2018' డైరెక్టర్ తో మెగాస్టార్

'2018' డైరెక్టర్ తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.యువ హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం చిరు మరో డైరెక్టర్ కథకి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. మలయాళం లో 2018 మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నడైరెక్టర్ జూడ్ అంటోనీ జోసెఫ్(Jude joseph antony) మెగాస్టార్ కి ఓ ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ ని వినిపించాడని సమాచారం. సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఉంటుందని టాక్. ఇక ఈ స్టొరీకి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

జోసెఫ్ 2018 మూవీని తెలుగు లో గీతా ఆర్ట్స్ 2(GA2 Pictures) బ్యానర్ పై డబ్ చేసి రిలీజ్ చేశాడు. 2018 మూవీ ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ కి స్టొరీ లైన్ ని దర్శకుడు చెప్పడం జరిగిందని సమాచారం.ఇప్పుడు చిరుతో తీయబోయే ఈ మూవీని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.