రీమేక్ చేశాడంటే.. హిట్ కొట్టినట్టే.. మెహర్ రమేష్ క్రేజీ సెంటిమెంట్

రీమేక్ చేశాడంటే.. హిట్ కొట్టినట్టే.. మెహర్ రమేష్ క్రేజీ సెంటిమెంట్

డైరెక్టర్ మెహర్‌ రమేష్(Meher Ramesh) తాజా చిత్రం ‘భోళా శంకర్‌’(Bhola Shankar). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఈ మూవీ మెహర్ రమేష్ కు చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ సినిమా హిట్ మెహర్ రమేష్ కు చాలా అవసరం. గతంలో మెహర్ రమేష్ నుంచి వచ్చిన శక్తి, షాడో మూవీలు బాక్సాపీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇక శక్తి సినిమా నిర్మాత అశ్వనీదత్(Aswani Dutt) ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయానని స్వయంగా నిర్మాతనే ప్రకటించడం విశేషం.

ఇవి కూడా చదవండి: అన్నా.. వస్తున్నా.. బండ్లన్న పొలిటికల్ ట్వీట్ వైరల్

ఇక మెహర్ రమేష్ ఇప్పటివరకు తీసిన బిల్లా,శక్తి, షాడో సినిమాలలో.. బిల్లా మూవీ తప్ప మిగిలిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నిజానికి మెహర్ రమేష్ రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో ఫెమస్ అని ఇండస్ట్రీ టాక్. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు వీరకన్నడిగ, అజయ్ తెలుగు ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలకు రీమక్సే. ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది మెహర్ రమేషే.

మెహర్ రమేష్ కెరియర్ లో హిట్ కొట్టిన మూడు సినిమాలు రీమేక్ చేసినవే. ఇక తాజాగా మెహర్ రమేష్ చేస్తున్న భోళా శంకర్ కూడా  తమిళ హిట్ మూవీ వేదాళం రీమేకే. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ కొట్టం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.