ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న మెహ్రీన్ కౌర్

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న మెహ్రీన్ కౌర్

హనీ ఈజ్ బెస్ట్‌‌ అంటూ ‘ఎఫ్‌‌ 2’ చిత్రంలో ఆకట్టుకున్న మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. ప్రస్తుతం ఓటీటీలోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది. ఆమె నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. మిలాన్ లూత్రియాతో కలిసి ‘రానా నాయుడు’ ఫేమ్ సుపర్న్ వర్మ డైరెక్ట్ చేశారు. ఢిల్లీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఆయుధాలను అక్రమ రవాణా చేసే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యల్లో పడ్డారనేది మెయిన్ కాన్సెప్ట్.

ఇందులో ప్రేమ‌‌లో మోస‌‌పోయే యువ‌‌తిగా సంజన అనే ఎమోష‌‌న‌‌ల్ రోల్‌‌లో నటిస్తోంది మెహ్రీన్. మౌనీ రాయ్, తాహిర్ రాజ్ బాసిన్, వినయ్ పాఠక్, అంజుమ్ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్‌‌ స్టార్‌‌‌‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ‘స్పార్క్‌‌’ అనే చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.