శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్‌గా నటించగా, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘అదొక పెద్ద కథ’ అని నటుడు మురళీధర్ గౌడ్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలతో సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. డాక్టర్ పాత్ర పోషించిన కరుణకుమార్ బ్రాండ్ పేరు అడిగితే ‘జై బాలయ్య’ అని చెప్పడం మాస్‌కి మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది. మల్లేష్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి బాడీలాంజ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. మల్లేష్ భార్యగా గాయత్రి రమణ పాత్ర ఎమోషన్‌ని యాడ్ చేసింది. మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి పాత్రలు వినోదాన్ని పంచాయి. మార్చి 6న సినిమా విడుదల కానుంది.
