జ్యోతిష్యం..మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. ఆరు రాశుల వారికి కనక వర్షమే..!

జ్యోతిష్యం..మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. ఆరు రాశుల వారికి కనక వర్షమే..!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల యువరాజుగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  బుధుడు ఆధిపత్యం వహించే  మృగశిర నక్షత్రంలోకి  మే 25వ తేదీ సోమవారం రాత్రి 11:49 గంటలకు ప్రవేశించాడు.  జూన్ 1వ తేదీ వరకు ఆయన ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి వరంగా మారబోతోంది. ఈ నక్షత్ర పరివర్తనం కారణంగా ప్రధానంగా ఆరు రాశుల వారి జీవితంలో సంపద, పురోగతి, సంతోషాల వర్షం కురవనుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం. ...

తులారాశి: 

బుధుడు  మృగశిర నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ రాశి కి చెందిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తాడు.  ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకొనేలా చేస్తాడని పండితులు చెబుతున్నారు.  వృత్తి .. వ్యాపార విషయాల్లో మెరుగైన ఫలితాలను ఇచ్చేందుకు సహాయపడతాడు. కార్యాలయంలో గుర్తింపు వచ్చే విధంగాను... వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుధుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు. 

 వృశ్చికరాశి : 

మృగశిర నక్షత్రంలో బుధుడి సంచారం ఈ రాశి వారికి అత్యంత లాభదాయకంగా  ఉంటుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారంలో ఊహించని విధంగా బంపర్ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఆశించిన దానికంటే రెట్టింపు రాబడిని పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పాత డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు పెద్ద బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

ధనుస్సు రాశి: 

 బుధ గ్రహం .. మృగశిర నక్షత్రంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారు మీ బాధ్యతలను చాలా సమర్థవంతంగా నెరవేరుస్తారు. వ్యాపారం, వృత్తి జీవితం అత్యంత సానుకూలంగా కనిపిస్తుంది. మీకు అదృష్టం పూర్తి స్థాయిలో కలిసివస్తుంది. సరైన సపోర్ట్ లేక గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం లభించడమే కాకుండా, పెద్ద కంపెనీల నుండి ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఆఫర్లు వస్తాయి. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, గందరగోళం నుండి ఉపశమనం పొందుతారు. మీలో కొత్త ఉత్సాహం, ఏకాగ్రత పెరుగుతాయి.

మకర రాశి:

బుధుడి  నక్షత్రం మార్పు వలన ఈ రాశి వారికి  సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి విస్తరణ అవకాశాలు లభిస్తాయి. కొత్తగా స్టార్టప్ లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది. మార్కెట్‌లో మీ బ్రాండ్ వాల్యూ, గుర్తింపు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. జీవిత భాగస్వామితో చాలా కాలంగా నడుస్తున్న పాత విభేదాలు, మనస్పర్థలు పూర్తిగా తొలగిపోతాయి.

 కుంభ రాశి: 

 మృగశిర నక్షత్రంలో బుధ సంచారం ఈ రాశి వారిని  మరింత ఉల్లాసంగా చేస్తుంది. . పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో అద్భుతమైన విజయాన్ని లేదా ఉద్యోగ సమాచారాన్ని అందుకుంటారు.  ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు రావడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి బంధం మరింత మధురంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి

మీన రాశి:  

ఈ రాశి వారికి బుధుడు మెరుగైన  ఆర్థిక భద్రతను కలుగజేస్తాడు.  కొత్త అవకాశాలు వచ్చే విషయంలో బుధుడు కీలక పాత్ర పోషిస్తాడు.  బుధ గ్రహం అనుగ్రహం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల మద్దతు లభిస్తుంది.  కుటుంబంలో ఆనందం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.