జ్యోతిష్యం: కన్యారాశిలో మోస్ట్ పవర్ ఫుల్ గజకేసరి యోగం: ఆరు రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

జ్యోతిష్యం: కన్యారాశిలో మోస్ట్ పవర్ ఫుల్ గజకేసరి యోగం: ఆరు రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  అజ ఏకాదశి రోజున గజకేసరి యోగం ఏర్పడుతుంది. గ్రహాల రారాజు బుధుడు సెప్టెంబర్​ 7 సోమవారం  మధ్యాహ్నం 1:35 గంటలకు. తన సొంత రాశి  కన్యారాశిలోకి  అత్యంత పవర్​ ఫుల్​ యోగం ఏర్పడుతుంది.  అక్కడే   26వ తేదీ మధ్యాహ్నం 12:41 గంటల వరకు కొనసాగుతాడు.ఇప్పటికే శుక్రుడు .. తులా రాశిలో సంచరిస్తుండగా, సూర్యుడు –సింహ రాశిలో, కుజుడు –మిథున రాశిలో, శని– మీన రాశిలో వక్రీ స్థితిలో ఉన్నారు. ఈ అరుదైన గ్రహాల సంచారం వలన  కొన్ని  రాశుల వారికి అదృష్టం వరించనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . . 

మేష రాశి :  ఈ రాశి వారికి బుధుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అదృష్ణ కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబున్నారు. ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.  ఈ కాలంలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ చాలా వరకు పూర్తవుతాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో గుడ్​ న్యూస్​ వింటారు. ఈ కాలంలో మీ మాటతీరుకు చాలా మంది ఆకర్షితులవుతారు. ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా మీరు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అరుదైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధన లాభం కలగనుంది.

మిథున రాశి: కన్యారాశిలో గజకేసరియోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి  అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు ప్రణాళిక  వేస్తారు.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి.   పెండింగ్​ లో ఉన్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి సమయమని చెప్పవచ్చు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు.

కర్కాటకరాశి:  గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి ప్రత్యేక లాభాలున్నాయని పండితులు  చెబుతుతన్నారు.  కేరీర్​ విషయంలో మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతారు.  గతంలో మిమ్ములను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు రాక తప్పదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో గుడ్​ న్యూస్​ వింటారు. 

ఈ కాలంలో ఈ రాశి వారి మాటతీరుకు చాలా మంది ఆకర్షితులవుతారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అరుదైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధన లాభం కలగనుంది. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. వ్యాపారస్తులకు  అధికంగా లాభాలు వస్తాయి.  కుటుంబంలో ఆనందం...  సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కన్యారాశి :  ఇదే రాశిలో బుధుడు సంచరించడం వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది.  దీని వలన ఈ రాశి వారకి అదృష్టం తన్నుకొస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని చెబుతున్నారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. ఇతరుల నుండి గౌరవం, మర్యాద పెరుగుతుందని చెబుతున్నారు.  వ్యాపారంలో భారీ విజయం సాధిస్తారని, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చెబుతున్నారు. అన్ని ప్రయత్నాల్లోనూ మీకు అదృష్టం లభిస్తుందని, కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయని భావిస్తున్నారు. కొత్త ప్రయత్నాల్లో మీకు అభివృద్ధి లభిస్తుందని చెబుతున్నారు.

వృశ్చికరాశి:  బుధుడు కన్యారాశిలో సంచరించడం వలన ఈ రాశివారికి ఇప్పటి వరకు ఉన్నకష్టాలు తొలగుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఆదాయం పెరగడంతో పాటు అన్ని విషయాల్లో అదృష్టం కలసి వస్తుంది.  ఆన్‌లైన్ ప్రాజెక్టులు, కన్సల్టింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగ మార్పు జరగడంతో జీతం పెరిగే అవకాశం ఉంది. . మీ ఆదాయం ఊహించని విధంగా పెరిగిపోతుంది. ఇల్లు కట్టుకోవాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీ కృషికి సరైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. సంసార జీవితంలో ఆనందంతోపాటు అదృష్టం ఉంటుంది. 

 మీనరాశి: గజకేసరి యోగం వలన   ఈ రాశి వారికి  అద్భుతమైన ఫలితాలను కలుగుగాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీని వల్ల మీ జీవితంలో వివిధ రకాల మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నారు. కొత్తగా  నాయకత్వ పాత్ర పోషించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆర్ధికంగా లాభాలు కలిగే అవకాశం ఉండి.  ఆర్థిక లాభాలను తెస్తాయి. 

ఈ రాశి వారు టీమ్​ లీడర్​ గా రాణిస్తారు.  ఉద్యోగస్తులు సీనియర్​ ల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  అనుకోకుండా కొన్ని కొత్త ప్రాజెక్ట్​లు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బిజినెస్ చేసేవారు భారీగా ప్రయోజనం పొందుతారు. విదేశాలకు సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి సాధిస్తారు.  నిరుద్యోగులు అనుకున్న జాబ్​ ఆఫర్​ పొందే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు చేసే వారు శుభ పరిణామాలు చోటుచేపుకొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్నిV6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం