ఇవాళ మైఖేల్ జాక్సన్ చనిపోయిన రోజు ..కింగ్ ఆఫ్ పాప్ గా ఎలా ఎదిగాడు.. ఈ తరం పిల్లలు ఎంత మందికి తెలుసు

ఇవాళ మైఖేల్ జాక్సన్ చనిపోయిన రోజు ..కింగ్ ఆఫ్ పాప్ గా ఎలా ఎదిగాడు.. ఈ తరం పిల్లలు ఎంత మందికి తెలుసు

మూన్వాక్ చేసినా.. గిర గిర గుండ్రగా తిరిగినా..మునివేళ్లపై నిల్చున్నా..'అర్రె...మైకేల్ జాక్సన్లా చింపేసినవ్..' అంటరు.అంతలా 'మైకేల్ జాక్సన్' అనే పేరు జనాల బ్రెయిన్లలో ఫీడ్ అయ్యింది. పాప్ మ్యూజిక్ అతని యూనిక్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఊహకందని ఫ్యాన్ ఫాలోయింగ్ని అందించింది. గిన్నిస్ రికార్డులు, గ్రామీ అవార్డులు, బిల్ బోర్డ్ లిస్ట్లు అతని ముందు తలవంచాయి. పాప్ సంగీతంలో రారాజు స్థానాన్ని కట్టబెట్టాయి. ప్రతీ క్షణం.. ప్రపంచంలోని ఏదో ఒక మూల అతని పాటలు వినిపిస్తూనే ఉంటాయి.

పాప్ స్టార్ కావడం చాలా సింపుల్. ఒక"సాంగ్ రాసి.. దాన్ని స్వయంగా పాడాలి. పాప్ మ్యూజిక్ తో స్టెప్పుటే స్త్రీ కంపోజ్ చేయాలి. ఒక పాప్ స్టార్ చేసే మొదటి పని, రెండోపని.. ఆల్బమ్ ని కంపోజ్ చేసే విధానం. ఈ రెండు జనాల్ని ఆకట్టుకుంటేనే ఆ పాప్రా క్రేజ్ వస్తది. చాలా మంది చేసేది ఇదే. కానీ, ఎంజే మాత్రం పాప్ మ్యూజిక్కి ఒక కొత్తరంగుపులిమాడు. అతని సంగీతానికి కంపేరిజన్లు, కాపీ మార్కులు కనిపించవు. అతని సాంగ్స్. ఎమోషనల్ మ్యూజిక్ లవర్స్ కనెక్ట్ అవుతాయి. పిచ్చెక్కి ఊగిపోయేలా చేస్తాయి. మైకేల్ జాక్సన్ని రోల్ మోడల్గా తీసుకున్న ఆర్టిస్టులకు లెక్కేలేదు. ఒక మనిషి చనిపోతే ఇంటర్నెట్ క్రాష్ కావడం బహుశా మైకేల్ జాక్సన్ విషయంలోనే జరిగిందేమో!.

టార్చర్ తండ్రి

మైఖేల్ జాక్సన్ 1958, ఆగస్టు 29న అమెరికాలోని ఇండియానా రాష్ట్రం, గ్యారీ సిటీలో పుట్టాడు. తండ్రి పేరు జోసెఫ్. జోసెఫ్కకావాలనే కోరిక ఉండేది. కానీ, ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ కల నెరవేరలేదు. తొమ్మిది మంది పిల్లల్ని పోషించేందుకు ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కానీ.. తన కోరికను పిల్లల ద్వారా నెరవేర్చుకున్నాడు. ఐదుగురు పిల్లలతో కలిపి 'జాక్సన్-ఫై' అనేట్రూప్ నడిపాడు. చుట్టుపక్కల ఊళ్లలో స్టేజీ ప్రదర్శనలు ఇచ్చేవాళ్లు, ట్రూప్లో చేరేటప్పటికీ జాక్సన్ వయసు ఐదేళ్లు మాత్రమే. పైగా ఆ ట్రూప్లో అతని వాయిస్ పర్ఫార్మెన్స్ బాగుండేవి. అయితే జోసెఫ్ మాత్రం పిల్లలతో కఠినంగా వ్యవహరించేవాడు. చెప్పినట్లువినకపోయినా... షో హిట్ కాకపోయినా.పిల్లలను హింసించేవాడు. అప్పట్లో నల్లవాళ్లపై జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. కానీ, అదేం పట్టించుకోకుండా 'జాక్సన్-ఫ్లై' ఆల్బమ్స్ నిజనాలు ఆదరించారు.

ఓన్ ఐడెంటిటీ

ఫ్యామిలీ ట్రూప్ సక్సెస్ అయినా కూడా మైకేల్ జాక్సనికి సంతృప్తి కలగలేదు. సొంతంగా పాపులారిటీ సంపాదించుకునేందుకు ఒంటరిగా స్టేజ్ షోలు ఇచ్చాడు. మరోవైపు ప్రైవేట్ గా ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టాడు. 'జెన్, మ్యూజిక్ ఎనిమీ, ఫర్ అవర్ ది వరల్డ్, ఆఫ్ ది వాల్" ఆల్బమ్స్ తో ఎంతో పేరు ప్రపంచం మొత్తంమారుమోగిపోయింది. కానీ.. 1982 నుంచి మైకేల్ జాక్సన్ పాప్ కెరీర్ ఎవరూ ఊహించని . స్థాయిని అందుకుంది. అదే ఏడాదిలో రిలీజ్ అయిన థ్రిల్లర్ పాప్ మ్యూజిక్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ రికార్డులను ఇప్పటి వరకు ఏ పాప్ సాంగ్/ఆల్బమ్ బీటీ చేయలేకపోయాయి. "బిల్లీ జీన్, బీట్ ఇట్, వాన్నా వీ స్టార్టింగ్సంగ్, స్మూత్ క్రిమినల్' ఆల్బమ్స్ పాప్ సంగీతంలో ఎంజే సునామీ మొదలైంది. "డేంజరస్, డే డోంట్ కేర్ ఎబౌట్ అజ్, ది ఈజీ ఇట్....ఇలా మైకేల్ జాక్సన్ శకం పాతికేళ్లపాటు అలాగే కొనసాగింది.

పాజిటివ్ పర్సనాలిటీ

మైకేల్ జాక్సన్ పాజిటివ్ మనిషి. అతని పర్సనల్ లైఫ్ నిండా కాంట్రవర్సీలే. కానీ, అతను మాత్రం విమర్శలను చాలా టైట్ గా తీసుకునేవాడు.. పర్సనల్ గానే కాదు.. ప్రొఫెషనల్ కూడా. హుందాగా వ్యవహరించేవాడు. అమెరికన్థ్రిల్లర్ ఆన్ లొకేషన్ లో...కోసమే దేశాలన్నీ తిరిగి స్టేజ్ షోలు ఇచ్చేవాడు.. రాపర్ ఎమినెమ్, మైకేల్ జాక్సన్ను టార్గెట్ చేస్తూ ఒక స్పూఫ్ ఆల్బమ్ చేశాడు. ఆ దెబ్బకు మ్యూజిక్ క్రిటిక్స్, ఎండే ఫ్యాన్స్ అంతా ఎమినెమ్పై విరుచుకుపడ్డారు. అయితే జాక్సన్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగాఎమినెమ్ ఎవరో తెలీదంటూ కౌంటర్ కూడా.ఇచ్చాడు. ప్రత్యర్థుల గురించి మాట్లాడటం.. అనవసరంగా వాళ్లకు ప్రచారం ఇచ్చినట్లు అవుతుందని బలంగా నమ్ముతాడు ఎంకే. చిన్నతనంలో తండ్రి పెంపకంలో జైలులాంటి జీవితం అనుభవించాడు. అందుకే పెద్దయ్యాక తన చిన్నప్పటిలా కాకుండా అందమైన బాల్యంలా ఉంటే బాగుండు అనుకున్నాడు. అందుకే రెండు వేల ఎకరాల్లో నెవర్ ల్యాండ్" పేరుతో ఒక ఎస్టేట్ నిర్మించాడు. అక్కడ పిల్లలతో సరదాగా గడిపేందుకు మైకేల్ జాక్సన్ ఇష్టపడేవాడు. అదే అతని పై తర్వాతి కాలంలో పీడోఫైల్ (పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వ్యక్తి) ముద్ర వేసింది. సర్జరీలు.. అనారోగ్య సమస్యలతో బాడీ సహకరించకపోయినా కేవలం ఫ్యాన్స్ కోసమే దేశాలన్నీ తిరిగేవాడు.

రికార్డుల కింగ్

 ఎంటీవీ బ్రాడ్ కాస్ట్ అయిన తొలి బ్లాక్అర్టిస్ట్స్ ఆల్బమ్ బెల్లీ జీన్) మైకేల్ జాక్సన్దే. అంతేకాదు. ప్రపంచంలో 'మోస్ట్ ఎంటర్ టైనింగ్ మ్యాన్'గా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఘనత జాక్సన్ సొంతం. ఎంజే పేరు మీద మేడమ్ టుస్సాడ్ మ్యూజియాల్లో ఐదు విగ్రహాలు ఉన్నాయి. సంగీత ప్రపంచంలో ఉండేవాళ్లకు గ్రామీ అవార్డు సాధించడం చిరకాల కోరిక, జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డు అందుకోవాలనుకుంటారు. అలాంటిది ఏకంగా పదమూడు గ్రామీలను అందుకున్నాడు ఎంకే.పదహారు 'వరల్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 39 గిన్నిస్ బుక్ రికార్డులు.. చిన్నాచితకా అవార్డులన్నీ కలిపి మూడు వందలకు పైగా అవార్డులు సాధించాడు. అతని ఆల్బమ్స్ 'థ్రిల్లర్'కి ఏడు గ్రామీలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ కాపీలు అమ్ముడుపోయింది. ఈ ఆల్బమ్. ఈ రికార్డుని ఇంతవరకు ఏ పాప్ సాంగ్ కూడా బీట్ చేయలేకపోయింది. మ్యూజిక్ వీడియోలు, వాటిపై ఆదాయం, ప్రదర్శనలు, ఎండోర్స్ మెంట్, సోలో రికార్డింగ్స్, రాయల్టీస్.. ఇలా చనిపోయేదాకా జాక్సన్ సంపాదన వందల కోట్లలో ఉంది. జాక్సన్ ఆస్తిపాస్తులేకాదు.. అతను వాడిన వస్తువులు కూడా వేలంపాటలో రికార్డు ధరకి అమ్ముడుపోతుంటాయి.

ఐకానిక్ స్టెప్పు వెనుక..

మైఖేల్ జాక్సన్ ప్రదర్శనలో 'మూన్వాక్'కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే అది అతను సొంతంగా కంపోజ్ చేసింది మాత్రం కాదు. అప్పటికే మూన్వాక్ స్టాప్ కొన్ని ప్రాంతాల్లో పాపులర్. ఒకరోజు ఒక హోటల్ బయట రోడ్డు మీద కొందరు కుర్రాళ్లు డ్యాన్స్ చేస్తుండగా.. ఎంటే ఆ స్టెప్పుని పట్టేశాడట. 1983లో మ్యూజిక్ టేబుల్ సంస్థ 'మోటౌన్' 25వ వార్షికోత్సవ వేడుకల్లో తొలిసారి మైఖేల్ జాక్సన్ 'మూన్వాక్' స్టెప్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ స్టెప్కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. జాక్సన్ ట్రేడ్ మార్క్ చేతికి బ్లాక్ బ్యాండ్. చిన్నపిల్లలపై హింసకు వ్యతిరేకంగా దానిని కట్టుకునేవాడు. ఒకవేళ ఎండేకి కనుక అన్నేసి ప్లాస్టిక్ సర్జరీలు జరగకపోయి ఉంటే ఎలా ఉండేవాడో తెలుసా?. 'టెన్ ఫేసెస్ ఆఫ్ మైకేల్ జాక్సన్' అనే డాక్యుమెంటరీలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక కంప్యూటర్ గ్రాఫిక్ ఫొటోను విడుదల చేశారు. అది నెట్లో వైరల్ అయి సంచలనం సృష్టించింది. మైకేల్ జాక్సన్ జీవితం చుట్టూ విమర్శలు, వివాదాలు ఎన్ని అల్లుకున్నప్పటికీ.. పాప్ సింగర్లకు, డ్యాన్సర్లకు మాత్రం ఇప్పటికీ ఎంతో ఆరాధ్య దైవమే.


v6velugu