కేబుల్ బ్రిడ్జి పై అర్థరాత్రి యువకుల డ్యాన్సులు, వీడియోలు

కేబుల్  బ్రిడ్జి పై అర్థరాత్రి యువకుల డ్యాన్సులు, వీడియోలు

హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి యువకులు రెచ్చిపోతున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా ఫోటోలు,వీడియోలు తీసుకుంటున్నారు. వాహనాలు వస్తున్న గమనించకుండా డ్యాన్సులు చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చిరించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై ప్రమాదాలు జరగడంతో సెల్ఫీలను బ్యాన్ చేశారు అధికారులు. అయినా కొంతమంది వీడియోలు తీసుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.