హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ (ఎంఐఎం) పోటీకి దిగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 21 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపినట్లు పార్టీ వర్గాల సమాచారం. కడప మేయర్ పదవికి ఎంఐఎం అభ్యర్థిని నిలిపినట్లు తెలిసింది.
హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా పార్టీ తరఫున నామినేషన్ దాఖలైంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలపై ఎంఐఎం పోటీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్ బరిలోకి దిగడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా? టీడీపీకి అనుకూలిస్తుందా? అన్నది ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.
