జగన్ ఒక బాణం వేస్తే.. మేం కోటి బాణాలు వేస్తాం

జగన్ ఒక బాణం వేస్తే.. మేం కోటి బాణాలు వేస్తాం

షర్మిల కొత్త పార్టీపై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కామెంట్ చేశారు. జగనన్న తెలంగాణలోకి ఒక బాణం వేస్తే.. మేము కోటి బాణాలు వేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కరీంనగర్‌లోని ఐటీ టవర్‌లో చెట్లు నాటారు. అనంతరం ఐటీ టవర్‌లో ఉద్యోగాలు పొందిన 12మందికి నియామక ఉత్తర్వులు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు చెబుతున్నా.. మనం కేసీఆర్‌ను కాపాడుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల తెలంగాణలోకి వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ కూడా వస్తాడు. ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడు. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు, విధ్వంసాలు, ఫ్యాక్షన్ గొడవలు తప్పవు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయలసీమవాసులు ఏపీలో పోరాడుతున్నారు. కావాలంటే షర్మిల అక్కడికి వెళ్లి పార్టీ పెట్టాలి. ఆంధ్రా పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు. ఇప్పటికే తెలంగాణ బాగా అభివృద్ధి చేసుకున్నాం. అన్న, చెల్లెల్లకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి. మాపై ఎందుకు రుద్దడం’ అని మంత్రి గంగుల అన్నారు.

For More News..

బ్యాంకింగ్ రంగంలో బ్లండర్ మిస్టెక్.. రూ. 3,641 కోట్లు ఫార్వార్డ్

కేసీఆర్ బర్త్‌డే: అమ్మవారికి 2.5 కేజీల బంగారు చీర

బాంబు తయారీ నేర్పిస్తుండగా పేలుడు.. 30 మంది మృతి