తెలంగాణ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు : మంత్రి వెంకట్ రెడ్డి..

తెలంగాణ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు  : మంత్రి వెంకట్ రెడ్డి..

తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఆకాంక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. 

జైపాల్ రెడ్డి గారి పేరు మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని మంత్రి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమే అని కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి చెప్పారు.