ఆరోగ్యం సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుండే పోటీచేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆరోగ్యం సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుండే పోటీచేస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంగళవారం ( జనవరి 27 ) నల్లగొండ జిల్లాలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ క్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం సహకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుండే పోటీ చేస్తానని అన్నారు. దేశానికే ఆదర్శంగా ప్రతీక్ ఫౌండేషన్ ప్రభుత్వ స్కూల్ ను తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు.

అభివృద్ధి కోసం తాను ఏది అడిగినా CM కాదనరని.. నల్లగొండ మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసేందుకే కార్పొరేషన్ గా మార్చామని అన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నల్లగొండ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తానని.. నల్లగొండ పట్టణానికి 6 నెలల్లో 24 గంటలు తాగు నీరు అందిస్తానని అన్నారు కోమటిరెడ్డి.కొడంగల్ కు ఎన్ని నిధులు ఇస్తే నా నియోజకవర్గానికి అన్ని నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు.

తాను విద్యా శాఖ మంత్రి ఐతే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలను బంద్ చేయిస్తానని అన్నారు.  విద్యా వ్యాపారం కాదని.. కార్పొరేట్ విద్యా సంస్థలు పేదలను దోచుకుంటున్నారని అన్నారు.