కేసీఆర్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం(డిసెంబర్ 12) పరామర్శించారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

6 వారాల్లో కోలుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.