విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో రాణించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో రాణించాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్
  • నందిగామలో నూతన గౌడ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు, ప్రముఖులు

రాంచంద్రాపూర్​/పటాన్​ చెరు, వెలుగు:  విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి, పోటీ ప్రపంచంలో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌‌‌‌‌‌‌‌చెరు నియోజకవర్గంలోని నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ హాస్టల్ భవనాన్ని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. 

ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో గౌడ హాస్టళ్లను, వేములవాడ, కొమురవెల్లిలో సత్రాలను నిర్మించుకున్నామని, త్వరలో జోగులాంబ ప్రాంతంలోనూ సత్రం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సివిల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమయ్యే యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆర్థికంగా స్థిరపడిన దాతలు పేద విద్యార్థుల చదువుకు, పోటీ పరీక్షల కోచింగ్‌‌‌‌‌‌‌‌కు తమ వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.   కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ హాస్టల్ అధ్యక్షుడు చక్రవర్తి గౌడ్, తుళ్ల వీరేందర్ గౌడ్, కాట శ్రీనివాస్ గౌడ్, గీతా కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.