పాపన్న గౌడ్ విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం

పాపన్న గౌడ్ విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
  •     ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ట్యాంక్‌‌బండ్‌‌పై నిర్మిస్తున్న బహుజన వీరుడు పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విగ్రహ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని, ఆగస్టు మొదటి వారం కల్లా అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. విగ్రహం ఎత్తు, గద్దె నిర్మాణం, చుట్టూ నిర్మించే కాంపౌండ్ వాల్ డిజైన్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహ పరిసర ప్రాంతాలు ఆకట్టుకునేలా అందమైన ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.