సినీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

 సినీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను బాలీవుడ్ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా మార్చాలని  ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు.  సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు  సినీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నామని, హైదరాబాద్ ఇన్‌‌‌‌‌‌‌‌ఛార్జ్ మంత్రిగా తాను ఆ బాధ్యతలు చూస్తున్నానని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ మాట్లాడుతూ ‘రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాదాపు వంద చిన్న సినిమాలను  మా విజన్ స్టూడియో ద్వారా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చాం. అలాగే ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డ్స్ అందిస్తున్నాం’ అని చెప్పారు.  టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్,  ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ, వెన్నెల గద్దర్ తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.