పోలీసుల కాలర్ ఎందుకు పట్టుకున్నారో కేటీఆర్ చెప్పాలి.?

పోలీసుల కాలర్ ఎందుకు పట్టుకున్నారో కేటీఆర్ చెప్పాలి.?

స్పీకర్ అంటే కనీస గౌరవం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తీరుపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఇలాగే మాట్లాడాలని కేసీఆర్ చెప్పారా? అని ప్రశ్నించారు. పోలీసుల కాలర్ ఎందుకు పట్టుకున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. పోలీస్ సిబ్బంది గొంతు పిసికిన దృశ్యాలు కూడా కనిపించాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హుందాగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

బ్లాక్ టీషర్టులపై స్లోగన్లు వేసుకుని సభకు రావడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే విధానం ఇదేనా? అని నిలదీశారు.బీఆర్ఎస్ ముమ్మాటికీ సభా గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.