Fire accident : అక్రమ నిర్మాణాల వల్లే ప్రమాదాలు : తలసాని

Fire accident : అక్రమ నిర్మాణాల వల్లే ప్రమాదాలు : తలసాని

సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలుగా మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. చుట్టుప్రక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భవనం లోపల చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని.. మరో ఇద్దరు లోపల ఉండి ఉంటారని మంత్రి తెలిపారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని తలసాని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, నగరంలో ఇలాంటి భవనాలు 25వేలకు పైగా ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.