సిద్దిపేటలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేటలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేటలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్‌ను కట్ చేశారు.

ఈ వేడుకలకు చెన్నూరు నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ,భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. సిద్దిపేట వేదికగా చెన్నూరు కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన ఈ ఉత్సాహం పార్టీ వర్గాల్లో కొత్త జోష్ నింపింది. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.

కేక్ కటింగ్ అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి కార్యకర్తలకు, నాయకులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పడుతున్న శ్రమను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేసినందుకు నాయకులకు, కార్యకర్తలకు మంత్రి వివేక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.