సింగరేణిని నాశనం చేసిందే బీఆర్ఎస్..లక్ష జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 38 వేలకు తగ్గించారు: మంత్రి వివేక్

సింగరేణిని నాశనం చేసిందే బీఆర్ఎస్..లక్ష జాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 38 వేలకు తగ్గించారు: మంత్రి వివేక్
  • కేసీఆర్ ఆస్తులు ఉద్యమానికి ముందు ఎంత.. ఇప్పుడెంత?
  • కార్మిక శాఖపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి తప్పుడు ప్రచారాలు 
  • లేబర్ బోర్డులో అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ
  • 2018 నుంచి అన్ని చెల్లింపులపై విచారణ.. 2 నెలల్లో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • లేబర్ బోర్డును ప్రక్షాళన చేస్తామని వెల్లడి

 

హైదరాబాద్, వెలుగు:  లక్ష మంది ఉద్యోగులున్న సింగరేణిలో ఆ సంఖ్యను 38 వేలకు తగ్గించి, 62 వేల ఉద్యోగాలను లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరైన అవగాహన, సమాచారం లేకుండానే మాట్లాడడం అలవాటైందని విమర్శించారు. చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

గనుల వేలంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం

పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గనుల వేలం చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని వివేక్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయిస్తామని కేంద్రం లేఖలు రాసినా, నాటి కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి వేలంలో పాల్గొన్నామని, ఆర్కేఓసీ, తాడిచర్ల గనులను సాధించామని చెప్పారు. సింగరేణి లాభాలు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్ రావే అంగీకరించారని గుర్తుచేశారు. 


భవిష్యత్తు అవసరాల కోసం సింగరేణి పవర్ ప్లాంట్లను విస్తరిస్తున్నామని, దీనికి చేసే ఖర్చు మూలధన వ్యయమని వివేక్ చెప్పారు. అయినా కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్కన్ సెరాయ్ ఫైవ్‌‌స్టార్ హోటళ్ల వ్యాపారాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ లాభాలు గడించడం మాత్రమే ఆయనకు తెలుసని విమర్శించారు. సింగరేణి ప్రాంతాలైన చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాలకు దక్కాల్సిన డీఎంఎఫ్‌‌టీ, సీఎస్‌‌ఆర్ నిధులను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు మళ్లించి రూ.15 కోట్లతో క్రికెట్ స్టేడియం కట్టుకున్నది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అంతర్జాతీయ ఫుట్‌‌బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్‌‌కు రావడం యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. క్రీడల ప్రోత్సాహం కూడా సీఎస్‌‌ఆర్‌‌లో భాగమేనని, సింగరేణి నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు.

ఫామ్‌‌హౌస్‌‌లు, వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చియ్

ఉద్యమానికి ముందు కేసీఆర్‌‌కు 22 ఎకరాల భూమి ఉండేదని వివేక్ అన్నారు. ఉద్యమ సమయంలో అది 47 ఎకరాలకు పెరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో 300 నుంచి 400 ఎకరాలకు పైగా ఫామ్‌‌హౌస్‌‌లు, కుటుంబ సభ్యుల పేరిట వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎకరానికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం చూపించిన కేసీఆర్.. ఆ విద్యను రాష్ట్ర రైతులకు ఎందుకు నేర్పలేదని నిలదీశారు.

ఆ ప్రక్రియతో బోర్డుకు సంబంధం ఉండదు

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి (లేబర్ బోర్డు)లో నకిలీ సర్టిఫికెట్లతో నిధులు కాజేసిన వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు వివేక్ తెలిపారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకటరమణ, జూనియర్ ఆఫీసర్ రఫీలను సస్పెండ్ చేశామని చెప్పారు. క్లెయిమ్‌‌ల పరిశీలన, ఆమోదం, నిధుల చెల్లింపు అధికారాలు సంబంధిత అసిస్టెంట్ లేబర్ కమిషనర్లకే ఉంటాయని తెలిపారు. బోర్డుకు గానీ, మంత్రికి గానీ ఈ ప్రక్రియతో సంబంధం లేదని ప్రభుత్వ జీవో స్పష్టం చేస్తోందన్నారు.

అక్రమాలు 2018లోనే, గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమయ్యాయని వివేక్ ఆరోపించారు. అప్పటి నుంచి జరిగిన అన్ని చెల్లింపులపై విచారణ జరిపి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. తన వద్దకు వేలాది మంది ప్రజలు వినతులతో వస్తుంటారని, నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. తాను రాసిన లేఖను కూడా అధికారులు పరిశీలించి తిరస్కరించారని, దాని ఆధారంగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. లేబర్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వివేక్ ప్రకటించారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసి, కొత్త వ్యవస్థలు, సాంకేతికతను తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వం వసూలు చేయాల్సిన వందల కోట్ల రూపాయల లేబర్ సెస్‌‌ను పెండింగ్‌‌లో పెట్టిన బాధ్యులపై జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రిటికల్ మినరల్స్‌‌పై అటామిక్ ఎనర్జీ సంస్థలు అంచనా వేస్తున్నాయని తెలిపారు. కేంద్రం కొత్త విధానం ప్రకారం త్వరలోనే నివేదిక వస్తుందని వెల్లడించారు.

అప్పుల ఊబిలోకి రాష్ట్రం

బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని వివేక్ ఆరోపించారు. సింగరేణికి రూ.40 వేల కోట్ల బకాయిలు, కాంట్రాక్టర్లకు రూ.46 వేల కోట్ల బిల్లులు, ఉద్యోగుల బెనిఫిట్స్ కింద రూ.16 వేల కోట్లు చెల్లించకుండా కేసీఆర్ ఎగ్గొట్టారని విమర్శించారు. పోలీసుల పీఎఫ్ నిధులను కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, మిగతా నిధులన్నీ ఎటుపోయాయో అర్థం కావడం లేదన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.5 వేల కోట్ల వడ్డీ చెల్లించడానికే ఆదాయం సరిపోతోందని చెప్పారు. ఆ మొత్తంతో పేదలందరికీ డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చన్నారు. నిధుల దుర్వినియోగంపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ తనకు మంచి స్నేహితులని, వారిపై వ్యక్తిగతంగా కోపం లేదని వివేక్ అన్నారు. కేటీఆర్‌‌ను ‘యువరాజు’తో పోలుస్తూ చమత్కరించారు. స్నేహాలు వేరని, పాలన వేరని.. ప్రభుత్వం చట్టప్రకారమే దర్యాప్తు జరిపిస్తుందని స్పష్టం చేశారు.