పెద్దపల్లిలో సెల్ బే షోరూం సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

పెద్దపల్లిలో సెల్ బే షోరూం సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సెల్ బే మొబైల్స్ షోరూంను సందర్శించారు మంత్రి వివేక్. బుధవారం ( అక్టోబర్ 1 ) జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో కొత్తగా ప్రారంభించిన సెల్ బే షోరూంను సందర్చించారు మంత్రి వివేక్. ఈ క్రమంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు షోరూం యాజమాన్యం, సిబ్బంది. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సెల్ బే షోరూం ప్రారంభించానని.. సెల్ బే ప్రాడక్ట్స్ కూడా వాడానని అన్నారు మంత్రి వివేక్.సెల్ బే తెలంగాణ వ్యాప్తంగా 50కి పైగా ఔట్ లెట్స్ కలిగి ఉందని... మంచ క్వాలిటీ కలిగిన ప్రాడక్ట్స్ సెల్ బేలో దొరుకుతాయని అన్నారు మంత్రి వివేక్.

పెద్దపల్లి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సెల్ బే షోరూం వారు రెండో స్టోర్ ఓపెన్ చేశారని అన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలు సెల్ బేను ఆదరించాలని.. మంచి బిజినెస్ ఇవ్వాలని అన్నారు మంత్రి వివేక్.