Mirai: ‘మిరాయ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌.. ఫస్ట్ సింగిల్‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్

Mirai: ‘మిరాయ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌..  ఫస్ట్ సింగిల్‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్

‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, బుధవారం ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈనెల 26న ‘వైబ్‌‌‌‌‌‌‌‌ ఉంది’అనే పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేజ సజ్జా, రితికా నాయక్‌‌‌‌‌‌‌‌ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

మనోజ్ మంచు విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  సెప్టెంబర్ 5న 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది.