Vastu tips :బెడ్ రూంలో అద్దం ఏ దిక్కులో ఉండాలి.. అక్కడ నేలపై పడుకుంటే దోషం ఉంటుందా..!

Vastu tips :బెడ్ రూంలో అద్దం ఏ దిక్కులో ఉండాలి..  అక్కడ నేలపై పడుకుంటే దోషం ఉంటుందా..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. బెడ్​రూం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. బెడ్​ రూంలో అద్దం.. డ్రస్సింగ్​ రూం ఏ దిక్కులో ఉండాలి.. అలాగే బెడ్​ రూంలో నేలపై పడుకుంటే దోషం కలుగుతుందా.....మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న:  మాస్టర్ బెడ్ రూంలో  అద్దం ఏవైపు ఉండాలి?

జవాబు:  బెడ్​ రూంలో  ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలో అద్దం... డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు  చెబుతున్నారు. 

ప్రశ్న:  నైరుతి వైపు బెడ్​ రూంలో  నేలమీద పడుకోవచ్చా?

జవాబు:  మాస్టర్ బెడ్రూమ్ లో  నేలమీద పడుకోవడంలో ఎలాంటి దోషం లేదు. బెడ్​ పైనే పడుకోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే బెడ్ సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా గది ఏర్పాటు చేసుకోవాలని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు  సూచిస్తున్నారు