Mirzapur: The Movie Review : గన్స్, గ్యాంగ్స్, పవర్ గేమ్.. 'మిర్జాపూర్ ది మూవీ' నెత్తుటి రాజకీయం ఎలా ఉందంటే?

Mirzapur: The Movie Review : గన్స్, గ్యాంగ్స్, పవర్ గేమ్.. 'మిర్జాపూర్ ది మూవీ' నెత్తుటి రాజకీయం ఎలా ఉందంటే?

ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేసిన ఇండియన్ బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'మిర్జాపూర్'. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై భావోద్వేగాల విధ్వంసం సృష్టించేందుకు థియేటర్లలోకి అడుగుపెట్టింది. గన్స్, గ్యాంగ్స్, గద్దె కోసం గేమ్, నమ్మకద్రోహాలు, బూతు డైలాగులు, రక్తపాతం.. ఇవన్నీ కలిసిన ఆ ప్రపంచాన్ని వెండితెరపై మరింత గ్రాండ్‌గా చూపించేందుకు దర్శకుడు గుర్మీత్ సింగ్ చేసిన ప్రయత్నమే 'మిర్జాపూర్: ది మూవీ'  (Mirzapur: The Movie). భారీ అంచనాల మధ్య ఈ చిత్రం  సెప్టెంబర్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, జితేంద్ర కుమార్, రవి కిషన్, రసికా దుగ్గల్, షీబా చద్దా తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించిందా? ఎలాంటి రచ్చ చేస్తుందో చూద్దాం.. 

కథ ఏమిటంటే..

మిర్జాపూర్ సింహాసనంపై  కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) ఇప్పటికే మిర్జాపూర్ గద్దెపై రాజులా ఏలుతుంటాడు.  అయితే ఇంట్లోనే వారసత్వం విషయంలో చిచ్చు రాజుకుంటుంది. తన కొడుకు మున్నా భయ్యా (దివ్యేందు)పై తండ్రి కాలీన్ భయ్యాకు పూర్తిగా నమ్మకం లేదు. దీంతో  కాలీన్ భయ్యా.. గుడ్డు పండిట్ (అలీ ఫజల్), బబ్లూ పండిట్ (జితేంద్ర కుమార్)లను తన సామ్రాజ్యానికి కీలక వ్యక్తులుగా నిలబెడతాడు. దీంతో మున్నా భయ్యాలో అసూయ, కోపం, పగతో రగిలిపోతుంటాడు. 

ఈ క్రమంలో.. జైసల్మేర్  ప్రాంతానికి చెందిన డేంజరస్ డ్రగ్ లార్డ్ బబ్బన్ యాదవ్ (రవికిషన్) మిర్జాపూర్ సింహాసనంపై కన్నేస్తాడు. వ్యాపారవేత్తగా కనిపించినా అతని అసలు గేమ్ వేరే. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే బబ్బన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో మిర్జాపూర్ గేమ్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరుగుతుంది.  శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు.. మిర్జాపూర్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి పాత పగలను పక్కనబెట్టి మున్నా, గుడ్డు, బాబ్లూలు ఒక్కటవుతారు. ఆ తర్వాత రాజస్థాన్ ఎడారుల నుండి మిర్జాపూర్ వీధుల వరకు జరిగిన పవర్ పాలిటిక్స్, నెత్తుటి మైండ్ గేమ్‌లే ఈ సినిమా కథ. 

ఎవరెలా చేశారంటే?

ఓటీటీ సిరీస్‌ను థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు తగ్గట్టుగా మార్చడంలో దర్శకుడు గుర్మీత్ సింగ్ మంచి మార్కులు కొట్టేశాడు. మిర్జాపూర్‌కు ఉన్న రా నెస్‌ను కాపాడుతూనే యాక్షన్ సీన్లను మరింత భారీగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఫేస్ ఆఫ్స్, కార్ రేస్, గ్యాంగ్ వార్స్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ థియేటర్లలో మాస్‌కు మంచి కిక్ ఇస్తాయంటున్నారు ప్రేక్షకులు.

►ALSO READ | అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్‎లో ఒకదాని వెనుక ఒకటి 3 క్రేజీ సినిమాలు విడుదల

పంకజ్ త్రిపాఠి మరోసారి కాలీన్ భయ్యాగా తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. ఆయన కళ్లతోనే భయం పుట్టించే తీరు సినిమాకు పెద్ద ప్లస్. మున్నా భయ్యాగా దివ్యేందు మరోసారి తన స్వాగ్‌తో స్క్రీన్‌ను ఆక్రమించాడు. గుడ్డుగా అలీ ఫజల్ యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా బాగా క్యారీ చేశాడు. జితేంద్ర కుమార్ బబ్లూ పాత్రలో సహజంగా కనిపించాడని టాక్ వినిపిస్తోంది..  అయితే సినిమాకు అసలైన కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది రవి కిషన్. బబ్బన్ యాదవ్‌గా అతని మేనరిజమ్స్, వాయిస్, విలనిజం, చరిష్మా.. ప్రతి సీన్‌లోనూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా టెంపో కూడా పెరుగుతుంది.

ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా కూడా సినిమా రిచ్‌గా ఉంది. జాన్ స్టీవర్ట్ ఎడూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు మరింత పవర్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా జైసల్మేర్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు కొత్త విజువల్ ఫీల్ తీసుకొచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే సినిమా విషయంలో పెద్ద మైనస్ 197 నిమిషాల రన్‌టైమ్ ( సుమారు 3 గంటల 17 నిమిషాలు) . ఫస్ట్ ఆఫ్ లో కొంత నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్. సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ కాస్త షార్ప్‌గా ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేది అన్న టాక్ వినిపిస్తోంది.

మైనస్ ఇదే..

ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ కొంత నెమ్మదిస్తుంది. కొన్ని సీన్లు మరింత క్రిస్ప్‌గా ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. అలాగే సిరీస్‌లో బలంగా నిలిచిన మహిళా పాత్రలకు సినిమాలో తగినంత స్పేస్ ఇవ్వకపోవడం నిరాశ కలిగిస్తుంది. అయినా.. 'మిర్జాపూర్' అభిమానులకు కావాల్సిన భౌకాల్, బూతు డైలాగులు, రక్తపాతం, యాక్షన్, స్వాగ్, పవర్ గేమ్ అన్నీ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్, పోస్ట్-క్రెడిట్ సీన్లు ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తోందంటున్నా సినీ ప్రియులు..

మొత్తానికి.. 'మిర్జాపూర్: ది మూవీ' పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా, థియేటర్లలో భౌకాల్ చూపించే మాస్ గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్. సిరీస్‌ను ఫాలో అయ్యే వారికి ఇది పెద్ద స్క్రీన్‌పై చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ గా ఉంటుంది.. కొత్తవాళ్లకు మాత్రం 197 నిమిషాల ప్రయాణం కొంచెం ఎక్కువగా అనిపించొచ్చు. కానీ మిర్జాపూర్ ఫ్యాన్స్ కు మాత్రం.. కాలీన్ భయ్యా గద్దె మీద కూర్చుంటే.. థియేటర్‌లో భౌకాల్ మామూలుగా ఉండదు అంటున్నారు.