పొంగల్ రేసులో ..మిషన్ చాప్టర్1 మూవీ

పొంగల్ రేసులో ..మిషన్ చాప్టర్1 మూవీ

అరుణ్ విజయ్, అమీ జాక్సన్ జంటగా విజయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిషన్ చాప్టర్1’. ఎం.రాజ‌‌శేఖ‌‌ర్‌‌, ఎస్‌‌.స్వాతి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఆదివారం ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. వచ్చే పొంగల్‌‌కి వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోంది. తమ మిషన్ కోసం క్యాలెండర్స్‌‌లో పొంగల్‌‌ డేట్‌‌ను మార్క్ చేసుకోవాలని లైకా సంస్థ పోస్ట్ చేసింది. హై ఆక్టేన్ యాక్షన్ కోసం సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో అరుణ్ విజయ్ సీరియస్ లుక్‌‌లో కనిపిస్తుంటే, అమీ జాక్సన్ మిషన్ గన్ పట్టుకుని ఇంటెన్స్‌‌ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తోంది. కొంత గ్యాప్ తర్వాత అమీ జాక్సన్ పవర్‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించబోతోందని తెలుస్తోంది. మ‌‌ల‌‌యాళ నటి నిమిషా స‌‌జ‌‌య‌‌న్ కీల‌‌క పాత్ర పోషించింది. ‘ఫియర్‌‌‌‌లెస్ జర్నీ’ ట్యాగ్‌‌లైన్‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై తమిళంలో అంచనాలు ఏర్పడ్డాయి.  జి.వి.ప్రకాష్ సంగీతం అందించాడు.