వినోదం పంచే.. మిత్ర మండలి

వినోదం పంచే.. మిత్ర మండలి

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్,  ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ ఎం  లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో  విజయేందర్ ఎస్ దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. బన్నీ వాస్ సమర్పణలో   కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి  ‘మిత్ర మండలి’  అనే ఆసక్తికర టైటిల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.

ఇందులోని  ప్రధాన పాత్రలను చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అన్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోందని చెప్పడం మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకున్న  నిహారిక ఎన్.ఎం ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నాడు.