వైరల్ వీడియో: పాట పాడుతూ నాటేసిన ఎమ్మెల్యే సీతక్క

వైరల్ వీడియో: పాట పాడుతూ నాటేసిన ఎమ్మెల్యే సీతక్క
  • ఒక రోజు రైతుగా బతికెతే వారి కష్టం ఏంటో అర్థం అవుతుంది

కూలీలు వరినాట్లు వేసే సమయంలో అలసట తెలియకుండా ఉండటం కోసం పాటలు పాడుతూ పని చేస్తుంటారు. అలా పాటపాడుతూ వరినాటు వేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఒక రోజు రైతుగా బ్రతికి చూస్తే దాంట్లో ఉండే కష్టం ఏంటో అర్థం అవుతుందని ఆమె అన్నారు. ఆమె గురువారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో.. నాట్లు వేస్తున్న కూలీలను చూసి ఆగారు. వారివద్దకు వెళ్లి వారితో కలిసి నాట్లేసారు. అంతేకాకుండా తన వెంట వచ్చిన కార్యకర్తల చేత కూడా నాట్లు వేయించి సందడి చేశారు. మహిళా కూలీలతో కలిసి పొలంలోకి దిగిన సీతక్క.. సరదాగా పాటలు పాడుతూ నాట్లు వేశారు. నిత్యం ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ.. ప్రజల అవసరాలను తీర్చే ఆమె.. నాటు పనుల్లో నేను సైతం అంటూ పొలంలోకి దిగారు. కూలీలతో శృతి కలిపి పాటలు పాడారు.

For More News..

వడ్లు అమ్మితే వచ్చిన డబ్బుల్ని లోన్ కింద జమచేసుకుంటున్నరు

ఐదెకరాలలోపు రైతులకే రైతుబంధు ఇవ్వాలి