
ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి(Keeravani) కంపోజ్ చేసిన ప్రాజెక్ట్ నా సామిరంగ(Naa Saamiranga). నాగార్జున(Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని(Vijay Binny) దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కీరవాణి(Keeravani) మాట్లాడుతూ.. నేను మొదటి నుంచి సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్నా. నాగార్జున గారితో పని చేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వచ్చింది. వాటిలో ప్రెసిడెంటు గారి పెళ్ళాం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఇది కూడా అంతే. అందులో ఎన్ని రకాల వినోదాత్మకమైన అంశాలు ఉంటాయో ఇందులో కూడా అన్నీ ఉంటాయి. ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్. తెలుగు సాంప్రదాయం, మన కట్టుబాట్లు, నేటివిటీ, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.
ఈ చిత్రానికి అన్ని పాటలు చంద్రబోస్ గారే రాశారు. సందర్భానుసారం వచ్చే ఓ పాటను మాత్రం నేను రాశా. అంతే కానీ నేనేమీ ప్రొఫెషనల్ లిరిక్ రైటర్‌ని కాదు. కొత్త దర్శకుడు విజయ్ బిన్ని తనను తాను నిరూపించుకోవాలనే కసితో పని చేశాడు. తను కొరియోగ్రాఫర్ కాబట్టి ప్రతి పాట డ్యాన్స్ కోణంలో ఆలోచించడం సహజం. కానీ దానికి భిన్నంగా ఇందులో చాలా మంచి మూడు మెలోడీస్ చేయించారు. పాటలు వైరల్ అవడం మన చేతిలో ఉండదు. మన పని మనం చేస్తూ ఉండాలి. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్‌కి కొంచెం కూడా పని చేయదని భావిస్తాను. నా వరకూ బాగా వర్క్ చేయాలి. డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి కనెక్ట్ కావాలి అనుకుంటా. ఇక చిరంజీవి గారి 156వ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి మూడు పాటలు రికార్డ్ చేశాం’ అని చెప్పారు.