టాలీవుడ్ లవ్ బర్డ్స్ జాబితాలోకి మరో క్రేజీ జోడీ చేరిపోయింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వారెవరో కాదు.. 'బలగం' మూవీతో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్, ఆస్కార్ గ్రహీత ఎమ్.ఎమ్. కీరవాణి తనయుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఫిలిం నగర్‌లో ముమ్మరంగా సాగుతున్న ప్రచారానికి స్వయంగా ఈ జంట చెక్ పెట్టింది.
కావ్య ఎమోషనల్ పోస్ట్..
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కాల భైరవతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ కావ్య ఓ బ్యూటిఫుల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'లైఫ్ అప్‌డేట్: ఐ ఫౌండ్ మై యెల్లో పేపర్ డైసీ! కొంతమంది మన జీవితంలోకి వచ్చాక, మనం దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలమనే భావన కలిగిస్తారు. సరిగ్గా మనకు తగ్గ వ్యక్తి దొరికినప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది' అంటూ మనసులోని ప్రేమను బయటపెట్టారు.
అంతేకాదు .. 'నా సాధారణ రోజులను సైతం ప్రత్యేకంగా మార్చినందుకు థ్యాంక్స్ భైరవ. నేను వద్దన్నా కూడా నాకు డైట్ కోక్ కావాలని గుర్తుపెట్టుకునే నువ్వు నా జీవితంలో జీవితాంతం ఉండాలి' అంటూ సరదాగా ప్రపోజ్ చేసినంత పని చేశారు. కాల భైరవ కూడా తమ బాండింగ్ జీవితాంతం కొనసాగుతుందని సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లి పీటలు ఎప్పుడంటే?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి' లో చిన్నప్పటి 'వల్లభి' గా మెప్పించిన కావ్య.. 'మసూద', 'బలగం' సినిమాలతో హీరోయిన్‌గా సక్సెస్ సాధించారు. మరోవైపు 'ఆర్‌ఆర్ఆర్' లో పాటలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా జోరు మీదున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో జంటగా దర్శనమిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు ఈ లవ్ బర్డ్స్.. ఇప్పుడు రిలేషన్‌ను అధికారికం చేయడంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి ఇప్పటికే ఎందరో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుున్నారు. ఇప్పుడు కీరవాణి కుటుంబంలోకి కావ్య కల్యాణ్‌రామ్ అడుగుపెట్టబోతుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రేమ జంటకు ఫ్యాన్స్ , సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు..
