గ్లోబల్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ డౌన్

గ్లోబల్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ డౌన్

 ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో కంపెనీలు మొబైల్ ఫోన్లు తెస్తున్నాయి. అందుకే ఏటా మొబైల్ మార్కెట్ షేర్ పెరుగుతూ ఉంటుంది. కానీ గతేడాది మాత్రం సీన్ రివర్సైంది. చరిత్రలో తొలిసారి మొబైల్ మార్కెట్ డౌన్ అయింది. క్యానలీస్ (లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్‌) రిపోర్టు ప్రకారం 2021తో పోల్చితే 2022లో మొబైల్ సేల్స్ 17శాతం తగ్గాయి. 

కోవిడ్ టైంలోనూ మొబైల్ మార్కెట్లో వృద్ధి కనిపించింది. కానీ 2022లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, మొబైల్ ధరలు పెరగడం సేల్స్ తగ్గేందుకు కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్ తగ్గినా గ్లోబల్ మొబైల్ మార్కెట్‌లో 25 శాతం వాటాతో యాపిల్‌ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (20%), షావోమీ (11%), ఒప్పొ (10%) , వీవో (8%) ఉన్నాయి. 2022లో షావోమీ మార్కెట్ షేర్ మాత్రం 2 శాతం తగ్గింది.