మోదీ అయ్య కూడాదిగిపోవాల్సిందే: పాట్నా ర్యాలీలో ఖర్గే వ్యాఖ్యలు వైరల్

మోదీ అయ్య కూడాదిగిపోవాల్సిందే: పాట్నా ర్యాలీలో ఖర్గే వ్యాఖ్యలు వైరల్

ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. 2026 అక్టోబర్ 25న బీహార్ లోని పాట్నా ర్యాలీ సందర్భంగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  మోదీ కాదు.. మోదీ అయ్య కూడా దిగిపోవాల్సిందే అంటూ తీవ్రస్థాయిలో చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారాయి. 

బీహార్ తొలి సీఎం, బీహార్ కేసరి డా.శ్రీక్రిష్ణ సింగ్ 139వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విధానాలపై విమర్శలు గుప్పించారు. 

ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని అన్నారు ఖర్గే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బ్లాక్ మనీ ఇండియాకు తీసుకొస్తానని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పారు. బ్లాక్ మనీ ఏమైందని ప్రశ్నించారు. 

అబద్ధాలు చెబుతున్న మోదీ దిగిపోవాల్సిందేనని ఖర్గే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సభలో ఒక వ్యక్తి.. మోదీ ఎక్కడ పోరని అనటంతో ఆగ్రహించిన ఖర్గే.. మోదీ కాదు.. మోదీ అయ్య కూడా దిగిపోవాల్సిందేనని అన్నారు. మోదీ కా బాప్ బీ జాయేగా.. అంటూ మండిపడ్డారు. 

ఆరెస్సెస్ పై విమర్శలు:

అదేవిధంగా ఆరెస్సెస్ స్థాపించిన నాటి నుంచి దేశంలో మత రాజకీయాలను చేస్తూ శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. దేశంలో ఆరెస్సెస్ ఉన్నన్ని నాళ్లు శాంతి ఉండదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ-ఆరెస్సెస్ వ్యవహరిస్తున్నాయని అన్నారు. అంటరానితనం లాంటి దురాచారాలను పాటిస్తూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

ఇక బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ పై ఫైరయ్యారు ఖర్గే. సోషలిస్ట్ ఐడియాలజీతో రాజకీయాల్లోకి వచ్చిన జేడీయూ అధినేత నితీష్ కుమార్.. మతతత్వ పార్టీతో జట్టుకట్టి తన భావజాలాన్ని చంపేశారని అన్నారు. ఒక వ్యక్తి బలహీనం అయినప్పుడు, తన భావజాలాన్ని పాతరేసినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని విమర్శించారు.