మొహబ్బత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న మూవీ స్టోరీ లైన్

మొహబ్బత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఆకట్టుకుంటున్న మూవీ స్టోరీ లైన్

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా సలీమ్ మాలిక్ (మ్యాక్)  దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న చిత్రం ‘మొహబ్బత్’. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.  చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌ చెప్పారు. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ ‘ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. 

నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌‌గా విడుదల చేయనున్నాం’ అని చెప్పాడు. నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ ‘నిర్మాతగా ఇది నా తొలిచిత్రం. మ్యాక్‌‌ టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంతో అందరికీ సక్సెస్ లభిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్స్‌‌ థ్యాంక్స్‌‌ చెప్పారు.  రైటర్ కలాంతో పాటు మూవీ టీమ్ అంతా  పాల్గొన్నారు.