
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban). లిజో జోష్(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar)లో మలైకోట్టై వాలిబన్ మూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
బ్రిటీష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ మూవీలో చూపించారు. ఓటమి ఎరుగని రెజ్లర్‌గా కనిపించారు మోహన్‌లాల్. బ్రిటీష్ ప్రభుత్వం అమాయకులను చంపుతుంటే, ఆ ప్రాంత ప్రజలను రక్షించే సేవియర్‌లా ఆయన పాత్ర ఈ సినిమాలో కనిపిస్తోంది. సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది.