
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban). లిజో జోష్(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన చిరంజీవి.. మోహన్ లాల్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
బ్రిటీష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఓటమి ఎరుగని రెజ్లర్‌గా కనిపించారు మోహన్‌లాల్. బ్రిటీష్ ప్రభుత్వం అమాయకులను చంపుతుంటే, ఆ ప్రాంత ప్రజలను రక్షించే సేవియర్‌లా ఆయన పాత్ర కనిపిస్తోంది. సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా విడుదల కానుంది.