ప్రేమలు’ హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times). డార్క్ కామెడీ-డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ ఇవాళ శుక్రవారం (జులై 3, 2026న) ఓటీటీలోకి వచ్చేసింది. ఏకంగా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది.
ఇండియన్ సినీ లవర్స్ కోసం జియోహాట్‌స్టార్లో అందుబాటులో ఉండగా, విదేశీ ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రూ.18 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ, మలయాళ సినీ పరిశ్రమలోని రాజకీయాలు, గేట్‌కీపింగ్, ఈగోల మధ్య తన కలలను నిజం చేసుకోవాలనుకునే యువ దర్శకుడి కథను కళ్ళకు అద్దింది. ఈ నేపథ్యంలోనే చిత్రానికి IMDBలో 7.5 రేటింగ్ లభించింది.
A love-hate letter to Malayalam cinema. Mollywood Times streaming from July 3, only on JioHotstar.
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 26, 2026
Watch in Malayalam, Tamil. Telugu, Kannada and Hindi.#MollywoodTimes #MollywoodTimesOnJioHotstar #JioHotstar pic.twitter.com/qRCcbaRtU2
కథేంటంటే:
ఈ సినిమా కథ వినీత్ మాధవన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. కుట్టిక్కానం ప్రాంతానికి చెందిన అతడు మలయాళ సినీ పరిశ్రమలోనే గొప్ప హారర్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు. హాలీవుడ్ దర్శకుడు ఎం. నైట్ శ్యామలన్ నుంచి స్ఫూర్తి పొందిన వినీత్, తన ఆలోచనలతో హారర్ జానర్‌ను తిరిగి పునరుజ్జీవింపజేయగలనని నమ్ముతాడు.
మొదట షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించిన వినీత్, తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీ రాజకీయాలు, క్రియేటివ్ డిఫరెన్సెస్, ఐడియాలకు క్రెడిట్‌పై వివాదాలు వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు.
తన కళాత్మక దృష్టిని కాపాడుకోవడానికి రాజీ పడని వినీత్, ఆ నిర్ణయంతో వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆసక్తి మరియు మోజు మధ్య ఉన్న సన్నని గీతను చూపిస్తూ, మలయాళ సినీ పరిశ్రమలోని అంతర్గత వ్యవస్థపై వ్యంగ్యంగా తెరకెక్కిన చిత్రమే ‘మాలీవుడ్ టైమ్స్’ (Mollywood Times).
A story of ambition, authorship, and the madness of making cinema .
— JioHotstar Telugu (@JioHotstarTel_) July 3, 2026
Mollywood Times is now streaming JioHotstar.
Watch in Malayalam, Tamil, Telugu, Kannada and Hindi.#MollywoodTimes #MollywoodTimesOnJioHotstar #JioHotstar@naslen__ @abhinavsnayak pic.twitter.com/4UbLWJQeLL
విశ్లేషణ:
‘మాలీవుడ్ టైమ్స్’ సాధారణ సినిమా కథలా కనిపించినా, ఇందులో దర్శకుడు సినిమా పరిశ్రమలోని వాస్తవాలను వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఒక యువ దర్శకుడి కలలు, ఆశయాలు, వాటిని సాధించే క్రమంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, రాజకీయాలు, క్రెడిట్ కోసం జరిగే పోరాటాలను కథలో ప్రధానాంశాలుగా తీసుకున్నారు.
హారర్ సినిమాలపై అమితమైన ఆసక్తి కలిగిన వినీత్ మాధవన్ పాత్ర ద్వారా సృజనాత్మకత మరియు వాణిజ్య ఒత్తిళ్ల మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కొత్తవారు ఎదుర్కొనే సవాళ్లు, అవకాశాల కోసం పడే కష్టాలు, తమ ఆలోచనలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
అలాగే, కళాత్మక దృష్టిని కాపాడుకోవాలనే పట్టుదల ఒక దశలో మోజుగా మారితే దాని ప్రభావం వ్యక్తిగత జీవితంపై ఎలా పడుతుందో సినిమా చూపించే ప్రయత్నం చేసింది. హాలీవుడ్ దర్శకుడు ఎం. నైట్ శ్యామలన్ నుంచి స్ఫూర్తి పొందిన హీరో ప్రయాణం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
