షాపుకు వెళ్లి.. ఇలాంటి ప‌ప్పు తీసుకురా.. కొడుక్కి శాంపిల్స్ ఇచ్చిన త‌ల్లి

షాపుకు వెళ్లి.. ఇలాంటి ప‌ప్పు తీసుకురా.. కొడుక్కి శాంపిల్స్ ఇచ్చిన త‌ల్లి

ఈ కాలం పిల్లలకు ఏమీ తెలియదా.. అంతా అయోమయమా.. తినేది ఏంటో కూడా తెలియదా.. మొబైల్ లేకపోతే ఏదీ గుర్తు పట్టలేరా.. ఏదీ గుర్తించలేరా.. మరీ అంత సుద్ద పప్పులుగా ఉన్నారా ఈనాటి పిల్లలు.. అంటే అన్నారంటారు కానీ.. ఓ తల్లి చేసిన పని వల్లే ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. షాపుకు వెళ్లి కందిపప్పు తీసుకురమ్మని చెప్పిన తల్లి.. కొడుక్కి కందిపప్పు ఎలా ఉంటాయో తెలియటం కోసం.. ఓ కవర్ లో కందిపప్పు గింజలు వేసి ఇవ్వటం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.. మమ్మీ ఇచ్చిన కందిపప్పు శాంపిల్స్ కవర్ ను.. ఆ కొడుకు ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టటంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక్కడ రెండు వెర్షన్స్.. కొడుకు ఎప్పుడూ మొబైల్ లోనే ఉంటాడు అనటానికి.. ఆ పిల్లోడు పెట్టిన కవర్ ఒక సాక్ష్యం అయితే.. నాకు కందిపప్పు ఎలా ఉంటాయో తెలియదని మమ్మీ గట్టిగా నమ్ముతుంది అని చెప్పటం మరో విశేషం..

కిరాణా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు మీలో ఎంతమంది లిస్ట్‌ని తీసుకువెళతారు? మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువును కూడా శాంపిల్ గా తీసుకెళ్లవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా. ఇదే ఆలోచన ఓ తల్లికి వచ్చింది. ఎర్ర పప్పు సాంపిల్ ను తన కొడుక్కి అందించిన ఓ ఫొటో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది "మా అమ్మ నాకు గుర్తుండదని,  నా మీద నమ్మకం లేక స్టోర్ కు వెళ్లేటప్పుడు ఇలా దాల్ శాంపిల్ ను నాకు ఇచ్చింది" అని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకువచ్చారు. దాంతో పాటు తన తల్లి, తనకు ఇచ్చిన శాంపిల్ ను చూపే ఓ ఫొటోను కూడా అతను షేర్ చేశారు.

ఈ పోస్ట్ షేర్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకు 82వేల వ్యూస్ ను అందుకుంది. "ఓహ్ ఈ దాల్ ప్యాకెట్‌ని చూడగానే, మా స్క్రాప్‌బుక్‌లపై వివిధ రకాల పప్పులు, ధాన్యాలను అతికించి, వాటిని లేబుల్ చేయాల్సిన ప్రాజెక్ట్‌లు నాకు గుర్తుచేస్తున్నాయి... " అని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకువచ్చారు. “నేను 22 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నప్పుడు, రెసిపీ పుస్తకంలో వేర్వేరు దాల్‌లను ఉంచాను. వాటిని నేను గుర్తుంచుకునేలా ఇలానే లేబుల్ చేసాను” అని మరొకరు కామెంట్ బాక్స్ లో తెలిపారు. ఇలా ఈ పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ తమ భావాన్ని పంచుకుంటున్నారు.

My mom gave me a sample of the kind of daal she wanted me to get from the store because she didn’t trust me to remember ? pic.twitter.com/6u22wCI9Ls

— Ahmed // Rani & Munni stan ??‍♂️ (@dumyboyfriend) July 18, 2023