కంటతడి పెట్టిస్తున్న కన్నతల్లి ప్రేమ

కంటతడి పెట్టిస్తున్న కన్నతల్లి ప్రేమ

ఓ వైపు చావు బతుకులతో పోరాడుతూనే.. మరోవైపు తన మాతృత్వాన్ని చాటుకుంది ఓ కోతి. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కోతి, రక్తం కారుతున్నాకూడా పట్టించుకోకుండా.. ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలిచ్చింది. ఈ విషయంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అయితే అసలు ఈ ఫోటోలో గాయపడ్డ కోతికి ఉన్నది రక్తమో కాదో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

కంటతడి పెట్టించిన కన్నతల్లి ప్రేమ

కోతులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో రోడ్డున పోయే వారు ఆగి ఏదో ఒకటి వేస్తూ.. వాటితో సెల్ఫీలు దిగుతూ.. ఫోటోలు కూడా తీస్తుంటారు. అలా వేసే పండ్లను తింటూ.. కోతులు చెట్లవెంట, పుట్టలవెంట తిరుగుతూ బతుకుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ కోతి ఆహారం కోసం వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా ఓ వాహానం ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కోతికి గాయాలయ్యాయి. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి జంతు ప్రేమికులు తెగ వైరల్ చేస్తున్నారు.

రక్తం కారుతున్నా..

అదే సమయంలో ఆ కోతి.. పిల్ల కోతి ఆకలితో ఉండటం చూసింది.  చూసినవెంటనే.. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా తన బిడ్డకు పాలిచ్చి తల్లి ప్రేమను చాటుకుంది. ఓ వైపు తల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బిడ్డను చేతులతో పట్టుకుని పాలిచ్చింది. ఈ అరుదైన దృశ్యం రోడ్డుపై వెళ్లే వారిని కంటతడి పెట్టించింది. తల్లి కోతి చూపించిన మాతృత్వం అక్కడివారి మనసులను కదిలించింది. దాంతో అటుగా వెళ్లే ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని తన మొబైల్‌లో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టాడు.