
Monkey Money Rain: బృందావన్ ప్రాంతంలోని కోతులు అక్కడికి వచ్చే టూరిస్టులు, భక్తుల నుంచి వస్తువులు లాక్కుని ఆటపచ్చిస్తూ చివరికి వాటిని తిరిగి ఇచ్చేసే వీడియోలు మనం చాలా మార్లు చూస్తూనే ఉంటాం. అయితే ఈ సారి కోతి సరాదాగా చేసిన ఒక పని వైరల్ అవుతోంది.
వాస్తవానికి కర్ణాటకకు చెందిన ఒక టూరిస్ట్ తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఒక నాటీ కోతి అతని వద్ద నుంచి రూ.500 నోట్ల కట్టను లాక్కుంది. అక్కడితో ఆగని కోతి ఆ డబ్బు కట్టలతో చెట్టుపైకి ఎక్కి దర్జాగా నోట్లను లాగి వెదజల్లింది. ఇది చూస్తుంటే ఏదైనా డాన్స్ షోల సమయంలో డబ్బులు విరిసినట్లు కనిపించింది. అయితే తన వద్ద ఉన్న డబ్బును కోతి లాక్కోవటంతో సదరు టూరిస్ట్ ఆందోళన చెందాడు.
In #TamilNadu’s famous hill station, Kodaikanal, a cheeky monkey stole a ₹500 bundle from a tourist in the Guna Caves area. It then theatrically climbed a tree and tossed each note into the air, creating a chaotic cash-catching frenzy! pic.twitter.com/azY7lzKxeC
— Ashish (@KP_Aashish) June 16, 2025
తాను తస్కరించిన డబ్బు కట్టలకు రబ్బర్ బ్యాండ్ వేసి ఉండటంతో కోతి కొద్దికొద్దిగా నోట్లను లాగి కింద పడేసింది. కొన్ని సెకన్లలోనే డబ్బు మెుత్తాన్ని కిందకు జారవిడిచింది. దీంతో రద్దీగా టూరిస్టులతో ఉండే గుణా కేవ్స్ ప్రాంతంలో సదరు టూరిస్ట్ తన స్నేహితులతో కలిసి కిందపడిన నోట్లను ఏరుకున్నాడు. అక్కడే ఉన్న ఇతర టూరిస్టులు కూడా నోట్లను కలెక్ట్ చేసి అతనికి అందించారు. అయితే ఈ క్రమంలో కొన్ని నోట్లు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో దొరికిన కాడికి డబ్బులతో టూరిస్ట్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.