కోతుల బైక్‌ రైడ్.. వీడియో వైరల్

కోతుల బైక్‌ రైడ్.. వీడియో వైరల్

జంతువులకు కూడా హావ భావాలు, మనో భావాలు ఉంటాయి. చాలా సార్లు అవి మనుషుల కదలికలు, స్వభావాలను కనిపెడుతూంటాయి. ఆ తరహాకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. అతని వెనక భాగంలో నాలుగు కోతులు కూర్చొని ఉన్న ఈ వీడియో రీసెంట్ గా ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ వీడియోలో వ్యక్తి బైక్ రైడింగ్ చేస్తుండగా.. ఆ నాలుగు కోతులు కదలకుండా ఒకదానికొకటి పట్టుకొని ఉన్నాయి. అంతే కాదు ఎలాంటి భయం లేకుండా చాలా బ్యాలెన్స్ డ్ గా కూర్చొని ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో ఆ కోతులకు ఎంత మంచి సంబంధం ఉందో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. బైక్ రైడింగ్ చేస్తూ కదలకుండా బైక్ పై కూర్చొని వెళ్తున్న ఈ వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది. కాగా దీన్ని తారానా హుస్సేన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.