నీతి కథ : ప్రతి ఇంటి ముందు పులికి భోజనం.. పులిలోనూ సాధు స్వభావం ఉందని నిరూపించిన ఊరి జనం..

నీతి కథ : ప్రతి ఇంటి ముందు పులికి భోజనం.. పులిలోనూ సాధు స్వభావం ఉందని నిరూపించిన ఊరి జనం..

నీతి.. న్యాయం గల ప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదె.. ఒకవేళ వచ్చినా తాత్కాలికమే.. మనుషులు నీతి తప్పుతారమోకాని.. జంతువులు మాత్రం నీతి తప్పవని కొండల్లో ఉండే పులి రుజువు చేసింది.  సాధు స్వభావంతో ఉన్న పులి గ్రామస్తులు పెట్టే ఆహారాన్ని మాత్రమే తిని.. ఎవరికి ఎలాంటి హాని చేయకుండా జీవితం కొనసాగించింది. 

కొండకు దిగువన దట్టమైన చెట్ల మధ్య ఓ గూడెం ఉండేది. కొండకు అవతలి వైపు ఓ పెద్ద పులి ఉండేది. వారంలో మూడు రోజులు అది గూడెంలోకి వచ్చి వెళ్తుంది. ఎవరికి ఏ హానీ చేయదు. అది వచ్చేటప్పటికి ఆ గూడెంలో ప్రతి ఒక్కరూ ఇళ్ల అది తినడానికి ఏదో ఒకటి ఉంచి వెళతారు. అది తిని మళ్ళీ తన నివాసానికి వెళుతుంది. ఇలా ఉండగా ఓ రోజు వేటగాడు ఆ గూడేనికి వచ్చాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. అప్పటికే రెండు పిట్టలను కొట్టి భుజం మీద వేసుకున్నాడు. అంతలో పులి గాండ్రింపు వినపడింది అతనికి.'ఎక్కడ పులి?' అని అడిగాడు.


అతని వాలకం చూసి 'ఎవరు మీరు? ఈ అడవిలో ఏ జంతువునూ వేటాడేందుకు వీలు లేదు. ఆ పెద్ద పులి మా ఊరి దైవం. ఎవరికీ ఏ హాని తల పెట్టదు. దయచేసి దానికి ఏ హాని కలిగించకండి' అని వేడుకున్నాడు ఓ పెద్దాయన.
ఆ మాటకు వేటగాడు నవ్వి.. 'మీరు అమాయకులు, క్రూరమృగాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. అది అదను చూసి మిమ్మలను. మీ పశువులను చంపుతుంది. జాగ్రత్తగా ఉండండి' అని హెచ్చరించాడు.


దానికి ఆ వ్యక్తి నవ్వి 'అది మృగం అయినా సాధు స్వభావం కలది. దానికి హాని చేస్తేనే అది దాడి చేస్తుంది. ఆ పులి వల్ల మాకు, మా గూడేనికి ఎప్పుడూ హాని జరగలేదు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి మా గూడేనికి వచ్చి వెళ్తుంది' అని చెప్పాడు.'అది హాని చేయదంటే నేను నమ్మను' అన్నాడు వేటగాడు.

ALSO READ : నీతి కథ: అసలైన శిల్పి ... తోటి వారిని గుర్తించాలి.. లేకపోతే జరిగేది ఇదే..!

"రేపు అది గూడేనికి వస్తుంది. ఇక్కడే ఉండి చూడండి' అన్నాడు ఆ పెద్దాయన.. ఆ వేటగాడు 'సరే'నని ఆ రాత్రికి అక్కడే వున్నాడు.మరుసటి రోజు గూడెంలోకి వచ్చింది పులి. ఓఇంటి ముందు కుర్రాళ్ళు ఆడుకుంటూ ఉంటే వారి మధ్య నుంచి వెళ్ళింది. పిల్లలు కూడా దాన్ని చూసి చూడనట్లు ఉన్నారు. అది చూసి ఆశ్చర్య పోయాడు వేటగాడు. ఆ పులి ఒక ఇంటి ముందు తోక ఆడిస్తూ కూర్చుంది. అప్పుడు ఒకామె పళ్లెంలో వంటకం తెచ్చి దాని ముందు పెట్టింది. అలా ప్రతి ఇంటిముందు పెట్టిన ఆహారం తిని వెళ్ళింది. 'చూశావా అది ఎవరికీ ఏ హాని చేయదు. ఎన్నో ఏండ్లనుండి అది ఇక్కడ మాతో మమేకమైంది. ఇప్పుడు మా భయమంతా మిమ్మల్ని చూస్తేనే. జంతువులకు ఏ హాని తల పెట్టకండి' అన్నాడు చేతులు జోడిస్తూ, జంతువుల పట్ల వారికి ఉన్న ప్రేమను చూసి అక్కడ నుండి కదిలాడు వేటగాడు.