వాట్సాప్‌లో పెట్టుకునే డీపీ లేదా ప్రొఫైల్ ఫొటోను మరింత సేఫ్ జోన్లో ఉంచేలా ప్రొటెక్షన్ కల్పిస్తోంది కంపెనీ. ఇందుకోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ప్రొఫైల్ ఫొటో లేని కాంటాక్ట్‌లను కేవలం వాళ్ల పేరు ద్వారానే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా వెంటనే గుర్తుపట్టొచ్చు. సేవ్ చేసిన కాంటాక్ట్ ఫొటోను వాట్సాప్ రెండు విధాలుగా చూపిస్తుంది. ఒకటి వాట్సాప్ అకౌంట్లో ప్రొఫైల్ పిక్చర్ లేకపోతే సెట్టింగ్స్లో అడ్రస్ బుక్‌లో సేవ్ చేసిన ఫొటోను చూపిస్తుంది. ఇది యూజర్‌కు మాత్రమే కనిపిస్తుంది.
ప్రొఫైల్ ఖాళీగా కనిపించకుండా ఉండేందుకు డీపీలో ఇతరులకు డిఫాల్ట్ ప్లేస్ హోల్డర్ కనిపిస్తుంది. దీన్ని ఎలా సెట్ చేయాలంటే.. ప్రైవసీ సెట్టింగ్స్లో ప్రొఫైల్ ఫొటోను ‘నో వన్’ లేదా ‘ఎక్సెప్ట్ మై కాంటాక్ట్స్’ ఆప్షన్స్ సెట్ చేసుకోవడం వల్ల ఎవరూ చూడలేరని తెలిసిందే. కానీ ఇప్పుడు అడ్రస్ బుక్‌లో ప్రైవసీ కోసం సేవ్ చేసి డీపీ ఫొటోను చూడగలరు. ప్రొఫైల్ ఫొటోను ఎవరూ చూడొద్దు అనుకుంటే రాబోయే కొత్త ఫీచర్ ప్రైవసీ సెట్టింగ్ ద్వారా లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ అడ్రస్ బుక్‌లో మాన్యువల్‌గా సేవ్ చేసుకున్న ప్రొఫైల్ ఫొటోను ఇతరులు చూడగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
