
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘అథర్వ’. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైంది. అవుట్‌పుట్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నామని.. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. గగన్, కిరణ్ మచ్చ, విజయ్ రామారాజు ఇతర పాత్రలు పోషించారు.