చే గువేరా స్ఫూర్తితో..

చే గువేరా స్ఫూర్తితో..

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా  రూపొందుతున్న చిత్రం ‘చే’.  లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్.  నవ ఉదయం సమర్పణలో బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్.. సోమవారం చేగువేరా వర్ధంతి సందర్భంగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సభావత్ నాయక్ మాట్లాడుతూ ‘విప్లవ వీరుడు, యువత స్ఫూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమాగా తీయడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు  ఇందులో చూపించబోతున్నాం’ అన్నాడు.  లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్  కీలకపాత్రలు పోషిస్తున్నారు.  రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు.