మైండ్ అంతా రీసెర్చ్ చేస్కో .. ఎక్స్‌‌ట్రా సెకెండ్ సాంగ్‌‌ రిలీజ్

మైండ్ అంతా రీసెర్చ్ చేస్కో .. ఎక్స్‌‌ట్రా సెకెండ్ సాంగ్‌‌ రిలీజ్

నితిన్, శ్రీలీల  జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్‌‌ట్రా’. ఆర్డినరీ మేన్ అనేది ట్యాగ్‌‌లైన్.  శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈమూవీ డిసెంబర్ 8న విడుదల కానుంది. ఇప్పటికే ‘డేంజర్ పిల్లా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. శుక్రవారం సెకెండ్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. 

‘ఐన్ స్టీన్ అయినా, అబ్దుల్ కలాం అయినా.. గొప్పోళ్లు అయ్యేముందు ఒక్కసారైనా.. పక్క వాళ్ల డాడీ తిట్టుండ్రరా నాయనా. ఏందీ పనులు అని చెప్పుంటారు చానా. గజినీలా కింద మీద పడితే ఏం తప్పు.. ఏంటో కంగారు ఏంటో సక్సెస్ అయ్యేలోపు..  హే మామ బ్రేష్సే వేస్కో.. మైండ్ అంతా రీసెర్చ్ చేస్కో..’ అంటూ సాగిన పాటలో నితిన్ స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. 

హ్యారిస్ జైరాజ్ కంపోజ్ చేసిన పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. సంజిత్ హెగ్డే పాడిన విధానం ఆకట్టుకుంది.