ఎక్స్‌‌ట్రా..  టీజర్ టైమ్

ఎక్స్‌‌ట్రా..  టీజర్ టైమ్

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎక్స్‌‌ట్రా’.  ఆర్డినరీ మేన్’ ట్యాగ్‌‌లైన్‌‌తో  శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 8న సినిమా విడుదల  కానుంది.  తాజాగా టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.  

ఈ నెల 30న టీజర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు నితిన్ కొత్త పోస్టర్‌‌‌‌తో ప్రకటించారు.  రెడ్ షర్ట్, గళ్ళ లుంగీ, మెడలో రెడ్ టవల్‌‌తో కూలీ గెటప్‌‌లో కనిపిస్తున్న నితిన్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘డేంజర్ పిల్లా’ సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆడియెన్స్‌‌కి రోల‌‌ర్ కోస్టర్‌‌లాంటి ఎక్స్‌‌పీరియెన్స్‌‌నిస్తూ,  న‌‌వ్విస్తూనే స‌‌ర్‌‌ప్రైజ్‌‌ల‌‌తో సినిమా మెప్పించ‌‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.