గాంధీ జయంతికి తెల్ల కాగితం సినిమా విడుదల

గాంధీ జయంతికి తెల్ల కాగితం సినిమా విడుదల

కోర్ట్, బ్యాండ్ మేళం వంటి చిత్రాలతో గుర్తింపును తెచ్చుకున్న హర్ష్ రోషన్..  హీరోగా నటిస్తున్న యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌టైనర్ ‘తెల్ల కాగితం’. నక్షత్ర హీరోయిన్. రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్,  మొదటి పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి.

తాజాగా రిలీజ్  చేసిన పోస్టర్‌‌లో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వర్షం వస్తుండగా,  ఓ అరటి ఆకును అడ్డుగా పెట్టుకుని ఉన్న వీరిద్దరి పోస్టర్ సినిమాలోని  ప్రేమకథను చూపిస్తోంది.  సామజవరగమన,  నారి నారి నడుమ మురారి  చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన నందు సవిరిగాన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.  విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.